![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 02:41 PM
అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని శ్రీశైలం జలాశయానికి గురువారం జూరాల నుంచి 66, 746 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 875. 60 అడుగులు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, నీటినిల్వ 166. 3148 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ 63, 150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే త్వరలోనే జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంది.