|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 02:32 PM
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. గురువారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నేతలు మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడాలని సూచించారు. క్రమశిక్షణ విషయంలో రాజీపడేది లేదని ఆయన పేర్కొన్నారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహేశ్ గౌడ్ తెలిపారు.