|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 01:13 PM

కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్‌ను బుధవారం అర్ధరాత్రి ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని పరిసరాలు, స్థితిగతులను వివరంగా పరిశీలించారు. రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్. హెచ్. ఓ రూమ్ వంటి విభాగాలను సందర్శించి, వాటి పనితీరును అంచనా వేశారు.
తనిఖీ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును కూడా తనిఖీ చేసి, వాటి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్‌లో భద్రత, సేవలు, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో సీఐ నవీన్ కుమార్, ఎస్సై రమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ సూచనల మేరకు స్టేషన్‌లో మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.