|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 12:55 PM
తెలంగాణ రాష్ట్ర భాజపా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్ రావును, సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వరావు గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపిన ఆయన, త్వరలో ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి, పార్టీ అభివృద్ధికి అందరూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.