![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 11:36 AM
వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేయడానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం SI సంతోష్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన నిఘాలో, రైల్వే స్టేషన్ సమీపంలో హ్యాండ్ బ్యాగ్‌తో అనుమానాస్పదంగా ఉన్న లాల్ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ.30 వేల విలువైన 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు DSP బాలకృష్ణారెడ్డి తెలిపారు.