![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 12:05 PM
కార్పోరేట్ హాస్పిటల్ కు కు సమానంగా ఎం.సి.హెచ్ ఆసుపత్రి లో మౌలిక వసతులు కల్పించామని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు.శుక్రవారం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాతా శిశు ఆసుపత్రిలో ఉన్న స్త్రీల వైద్యం ఓపి, ల్యాబ్, క్యాంటీన్ లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* ఆసుపత్రి ల్యాబ్ వద్ద రద్ది అధికంగా ఉన్నందున, దీనిని తగ్గించేందుకు శాంపిల్ కలెక్షన్ సెంటర్ లను పెంచాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికీ అవసరమైన 3 సీటర్(పేషెంట్లు కూర్చునే కుర్చీలు), కర్టెన్స్ , ఇతర సామాగ్రి ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని, ఆసుపత్రి కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందుతుందని అన్నారు.ఆసుపత్రిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని, అవసరం ఉన్న చోట ఏసీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, లోపల ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆస్పత్రి ప్రాంగణం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి లోని జెండా చౌరస్తా వద్ద గల (ఎం.ఆర్సి) మండల రిసోర్స్ సెంటర్& ఎంఈఓ కార్యాలయం ను పరిశీలించి సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్.ఎం.ఓ డాక్టర్ విజయ్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.