![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 12:11 PM
హైదరాబాద్‌లో 2 రోజుల క్రితం రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతిపై శంకర్‌పల్లి మరియు రైల్వే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అదుపులోకి తీసుకునే సమయంలో ఆమె పోలీసులపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మానసిక స్థితి గమనించిన పోలీసులు ఆమెను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విచారణకు హాజరుకావాల్సిందిగా సూచించారు,కొండకల్ నుంచి చిన్న శంకర్‌పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై ఆమె కారు నడిపింది. దీంతో గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. చికిత్స తర్వాత విచారణకు హాజరుకావాలని పోలీసులు తెలిపారు. కాగా, వోమిక సోనీ గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది.