![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 12:15 PM
104వ పీవీ జయంతి సందర్భంగా శనివారం నెక్లెస్ రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో మాజీ ప్రధాని నరసింహారావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉచిత ఐ స్క్రీనింగ్ క్యాంప్‌ను ప్రారంభించారు.విద్యారంగం బలోపేతం పీవీతోనే సాధ్యమైంద్నారు. దేశ ఆర్థిక రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. పీవీ విద్యా, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. వంగరలో స్మృతివనం, మెమోరియల్ సెంటర్ వచ్చే జయంతికి పూర్తి చేస్తామని తెలిపారు. పీవీ జీవితం యువతకు ఆదర్శమని మంత్రి అన్నారు.