![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 11:17 AM
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని ఓ గ్రామంలో అమానుష ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా హింసించారు. చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వివాహేతర బంధం కొనసాగిస్తున్న ఆ ఇద్దరికీ అరగుండు కొట్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నట్లు సమాచారం.