|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:31 PM
డిసెంబర్ 5వ తేదీన విడుదలైన 'ధురంధర్' సినిమా, 1400 కోట్లను వసూలు చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి, 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. ఇండియాపై ఎప్పటికప్పుడు ఉగ్రదాడులు చేయించడంలో పాకిస్థాన్ ఉత్సాహాన్ని చూపిస్తూనే ఉంటుంది. గతంలో జరిగిన విమానం హైజాక్ .. పార్లమెంట్ పై దాడి .. ఇండియన్స్ ను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇండియా సహనాన్ని పాకిస్థాన్ అసమర్థతగా భావిస్తుంది. మరింత ప్రమాదకరమైన పరిస్థితులలోకి ఇండియాను నెట్టడానికిగాను, ఉగ్ర సంస్థలు అక్కడి రాజకీయ నాయకుల అండదండలను తీసుకుంటూ ఉంటాయి. మాఫియా సంస్థలకు నాయకులుగా ఉన్న 'రెహ్మాన్' (అక్షయ్ ఖన్నా) అర్షద్ పప్పు (అశ్విన్ ధార్) .. ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) మధ్య గట్టిపోటీ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ పరంగా లబ్ది పొందాలని 'జమీల్'(రాకేశ్ బేడీ) .. వ్యాపార పరంగా ఎదగడానికి 'ఖనాని బ్రదర్స్' ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్లందరి కారణంగా, అక్రమ ఆయుధాలు విచ్చలవిడిగా ఉగ్రవాద శిబిరాలకు చేరుకుంటూ ఉంటాయి. నకిలీ కరెన్సీ విరివిగా అందుబాటులోకి వస్తుంటుంది. జరుగుతున్న పరిణామాల పట్ల ఏ నిర్ణయం తీసుకోవాలనే దిశగా, భారతీయ ఇంటెలిజెన్స్ విభాగంలో తర్జనభర్జనలు జరుగుతూ ఉంటాయి. మితిమీరిన మంచితనం అమాయకత్వం క్రిందికి వస్తుందని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తాడు. పాకిస్థాన్ కి తగిన విధంగా బుద్ధి చెప్పడం కోసం 'ఆపరేషన్ ధురంధర్' పేరుతో ఒక సీక్రెట్ మిషన్ ను వెంటనే మొదలుపెట్టవలసిన అవసరాన్ని ఆయన వ్యక్తం చేస్తాడు. పాకిస్థాన్ నేరసామ్రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుని, అక్కడే ఉగ్రవాదానికి 'ఉరి' వేసే ఒక సమర్ధుడిని ఎంపిక చేస్తాడు. పంజాబ్ లో జైలు జీవితం గడుపుతున్న ఒక యువకుడిని, హమ్జా (రణ్ వీర్ సింగ్) పేరుతో పాకిస్థాన్ కి పంపిస్తాడు. పాకిస్థాన్ లో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? అనేది కథ.
Latest News