|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:20 PM
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విజయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రోజుకో కొత్త రికార్డును సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి, తాను గతంలో దర్శకత్వం వహించిన ‘భగవంత్ కేసరి’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘బాలకృష్ణతో ఎవరూ ఊహించని విధంగా ఒక సినిమా చేయాలనుకున్నాను. నా కెరీర్‌లో ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో ‘భగవంత్ కేసరి’ ఒకటి. కానీ, ఆ సినిమా ఇంకా పెద్ద హిట్ కావాల్సింది. సినిమా విడుదలైన సమయంలో చంద్రబాబు నాయుడు జైలులో ఉండటం వల్ల బాలయ్య అభిమానుల్లో కొంత నిరాశ కనిపించింది. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమాను ఆదరించి హిట్ చేశారు. పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉంటే ఈ చిత్రానికి మరింత గొప్ప స్పందన వచ్చేది’’ అని అనిల్ అన్నారు.అలాగే, విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా స్క్రిప్ట్‌కు తాను సహాయం చేసిన తర్వాత, ఆ సమయంలో ఉన్న నిరాశ నుంచి కొంతవరకు బయటపడ్డానని కూడా అనిల్ రావిపూడి తెలిపారు.
Latest News