|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:30 PM
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, కోట్లాది మంది సంగీత ప్రియుల ఆరాధ్య దైవం అర్జిత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్‌గా కొత్త పాటలు పాడబోనని ఆయన ప్రకటించారు. తన 15 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతున్నట్లు మంగళవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ అనూహ్య ప్రకటనతో ఆయన అభిమానులు, సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, సంగీతాన్ని మాత్రం తాను వీడటం లేదని, స్వతంత్ర కళాకారుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు."అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా శ్రోతలుగా మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఇకపై సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్‌గా కొత్త అవకాశాలు స్వీకరించబోవడం లేదని సంతోషంగా ప్రకటిస్తున్నాను. నా ప్రయాణాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం" అని అర్జిత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మరో పోస్ట్‌లో, "సంగీతాన్ని మాత్రం నేను వదిలిపెట్టను. దేవుడు నా పట్ల దయగా ఉన్నాడు. ఒక చిన్న కళాకారుడిగా భవిష్యత్తులో మరింత నేర్చుకుంటాను, స్వతంత్రంగా సంగీతాన్ని సృష్టిస్తాను. ఇప్పటికే అంగీకరించిన కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని పూర్తి చేస్తాను. కాబట్టి ఈ ఏడాది నా పాటలు కొన్ని విడుదల కావచ్చు" అని ఆయన వివరణ ఇచ్చారు.
Latest News