|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 02:50 PM
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన రుక్మిణి వసంత్, రక్షిత్ శెట్టితో 'సప్త సాగరాలు దాచే' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో పరిచయమైనా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవల రిషబ్ శెట్టితో 'కాంతార చాప్టర్ 1' సినిమాలో విలన్‌గా నటించి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో ఆమె పేరు యావత్ భారతీయ సినీ పరిశ్రమలో మారుమోగింది. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'డ్రాగన్' చిత్రంలో నటిస్తోంది. తెలుగు, కన్నడ, తమిళంలో మరిన్ని అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఆకుపచ్చ చీరలో అందంగా మెరిసిపోయింది.
Latest News