|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 12:09 PM
సంక్రాంతి రేసులో విడుదలైన 'ది రాజాసాబ్' చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కినా బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చిందని తెలుస్తోంది. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 250 కోట్ల మేరకే వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో నిర్మాత విశ్వప్రసాద్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో, నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు సమాచారం. భవిష్యత్తులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఒప్పుకున్నారని, 'స్పిరిట్' మూవీ పంపిణీ హక్కులను మైత్రీ మూవీస్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా చేశారని తెలుస్తోంది. రాజాసాబ్ కోసం ప్రభాస్ పూర్తి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని టాక్.
Latest News