|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:28 PM
చిరంజీవి కథానాయకుడిగా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని, మెగాస్టార్ మళ్లీ తెరపై వెలుగులు నింపడం చూసి చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. "బాస్ ఈజ్ బ్యాక్" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన పూర్తి అభిప్రాయాన్ని పంచుకున్నారు."మన శంకర వరప్రసాద్ గారి మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు. మన బాస్ మళ్లీ వచ్చాడు. మన మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్లీ తెరపై చూడటం చాలా ఆనందంగా ఉంది. పూర్తి వింటేజ్ వైబ్స్ కనిపించాయి" అని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు. సినిమాలో కీలకపాత్ర పోషించిన వెంకటేశ్ గారి నటన అద్భుతంగా ఉందని, ఆయన షోను రాక్ చేశారని కితాబిచ్చారు. 'వెంకీ గౌడ' పాత్రను ఉద్దేశిస్తూ కన్నడలో "తుంబ చెన్నాగి మాడిదిరా" (చాలా బాగా చేశారు) అని ప్రత్యేకంగా అభినందించారు. నయనతార గ్రేస్ ఫుల్ ప్రజెన్స్‌తో ఆకట్టుకోగా, కేథరిన్ ట్రెసా తన హాస్యంతో అలరించిందని తెలిపారు.ఈ చిత్రంలోని 'బుల్లిరాజు' పాత్రలో నటించిన బాలనటుడిని 'సంక్రాంతి స్టార్' అంటూ ప్రత్యేకంగా ప్రశంసించారు. 'హూక్ స్టెప్', 'మెగా విక్టరీ' వంటి పాటలు విజిల్స్ వేయించేలా ఉన్నాయని, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోకు అభినందనలు తెలిపారు. నిర్మాతలు నా సోదరి సుస్మిత కొణిదెల, సాహు గారపాటిలకు శుభాకాంక్షలు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
Latest News