|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:25 PM
పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌ను లక్ష్యంగా చేసుకుని ఏఐ (AI) టెక్నాలజీతో డీప్‌ఫేక్ వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అకీరా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించి ఈ నకిలీ కంటెంట్‌ను సృష్టించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.ఈ డీప్‌ఫేక్ వీడియోల కారణంగా తన వ్యక్తిగత గోప్యతకు, భద్రతకు ముప్పు ఏర్పడిందని పేర్కొంటూ అకీరా నందన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన పేరు, చిత్రాలు, వీడియోలను దుర్వినియోగం చేయకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పేర్లతో ఫేక్ వీడియోలు సృష్టించడం తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Latest News