|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:53 PM
ట్రెండ్‌కు అనుగుణంగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో చూపిస్తూ రూపొందుతున్న చిత్రం ‘పురుష:’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు. వులవల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని బత్తుల సరస్వతి సమర్పణలో, కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు.కేవలం పోస్టర్లు, ఫస్ట్ లుక్స్‌తోనే ప్రేక్షకులలో ఆసక్తిని పెంచిన మేకర్స్, తాజాగా టీజర్‌తో ప్రేక్షకులను పూర్తిగా నవ్వించారు.ఇక తాజాగా విడుదలైన చిత్రంలోని థీమ్ సాంగ్ ప్రతి మగాడికి జాలి పడకుండా, వారి పరిస్థితిని మరింత సానుభూతితో చూపేలా ఉంది. పాటలో “జాలి పడేదెవ్వడు.. మగాడి మీద జాలి పడేదెవ్వడు” అనే లిరిక్స్ వినిపిస్తుంది. ఈ పాటను ఎం.ఎం. కీరవాణి అద్భుతంగా ఆలపించారు. శ్రవణ్ భరద్వాజ్ అందించిన క్యాచీ మెలడీ, శ్రోతలను వెంటనే ఆకట్టుకుంటుంది. అలాగే, అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ సినిమా కథను సులభంగా, ఫన్నీగా వివరిస్తూ, భార్యాభర్తల మధ్య బంధాన్ని చూపే విధంగా రూపొందించబడ్డాయి.
Latest News