|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:49 PM
జాన్వీ కపూర్ తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీని షాక్‌కి గురిచేస్తోంది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి, వెన్నంటి నిలిచిన స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్‌కు ఆమె షాకిచ్చింది. ఆయనకు చెందిన ‘ధర్మా ప్రొడక్షన్స్’ టాలెంట్ మేనేజ్‌మెంట్ నుంచి బయటకు వచ్చేసింది. ఇకపై సొంతంగా తన కెరీర్ నిర్ణయాలు తీసుకుంటానని జాన్వీ ఫిక్స్ అయ్యింది.ఇన్నాళ్లూ ఏ సినిమా చేయాలి, ఏ బ్రాండ్‌కు ప్రచారం చేయాలి అన్నదంతా కరణ్ జొహార్ కనుసన్నల్లోనే జరిగేవి. దీంతో ఆమెపై ‘నెపో కిడ్’ ముద్ర బలంగా పడింది. ఆ విమర్శల నుంచి బయటపడటానికే జాన్వీ ఇప్పుడు ‘కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్‌వర్క్’ అనే కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తల్లి శ్రీదేవి లాగే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని స్టార్‌డమ్ సంపాదించాలని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది.బాలీవుడ్ మేనేజ్‌మెంట్‌కు గుడ్‌బై చెప్పి, సౌత్ ప్యాన్-ఇండియా ప్రాజెక్టులతో కెరీర్ గ్రాఫ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలని జాన్వీ వేస్తున్న స్కెచ్ చూసి ఇండస్ట్రీలో అంతా షాక్ అవుతోంది.
Latest News