|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 06:24 PM
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఘన విజయం సాధించిన తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి జోష్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన అనిల్... ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ సినిమా కోసం చిరంజీవి చేసిన ఫొటో షూట్ చూసి తానే స్టన్ అయ్యానని అనిల్ చెప్పారు. ఆ లుక్ సినిమా మొత్తం కొనసాగాలని భావించానని, చిరంజీవి కూడా అదే విధంగా సహకరించారని తెలిపారు. చిరంజీవిని ఈ లుక్‌లో చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారని అన్నారు. పవన్ కల్యాణ్ తో సినిమా చేయడంపై ఆయన స్పందిస్తూ... ఇప్పటి వరకు తాను పవన్ కల్యాణ్ ను కలవలేదని చెప్పారు. డిప్యూటీ సీఎంగా ఆయన ఎంతో బిజీగా ఉన్నారని... ఆయనకు ఎన్నో పనులు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదని చెప్పారు. ఆయనతో సినిమా చేయాలనే ఉత్సాహం తనకు ఉందని... ఒకవేళ తమ కాంబినేషన్ కుదిరితే సంతోషమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.
Latest News