|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:28 PM
ప్రముఖ అమెరికన్ నటి సిడ్నీ స్వీనీ తన కొత్త లోదుస్తుల బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిన ఓ స్టంట్ వివాదాస్పదంగా మారింది. ప్రఖ్యాత హాలీవుడ్ సైన్ బోర్డుపైకి ఎక్కి లోదుస్తులను ప్రదర్శించడంపై ఆమె చట్టపరమైన చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఘటనపై లాస్ ఏంజిల్స్ పోలీసులు స్పందిస్తూ ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.ఇటీవల అర్ధరాత్రి సమయంలో, సిడ్నీ స్వీనీ నల్లటి దుస్తులు ధరించి కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత హాలీవుడ్ సైన్ బోర్డుపైకి ఎక్కారు. అక్కడున్న అక్షరాలకు ఓ తాడు కట్టి, దానికి బ్రాలను వేలాడదీశారు. ఈ మొత్తం స్టంట్‌ను వీడియో తీయగా, దానిని ప్రముఖ మీడియా సంస్థ టీఎమ్‌జెడ్ (TMZ) షేర్ చేసింది. ఈ వీడియో బయటకు రావడంతో వివాదం మొదలైంది.
Latest News