|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 01:49 PM
క్రికెటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై తాను చేసిన వ్యాఖ్యల వివాదంపై నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఖుషి ముఖర్జీ తొలిసారి స్పందించారు. సూర్యకుమార్ తనపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి అనవసరంగా పెద్ద వివాదం చేస్తున్నారని, తనకు ఇప్పటివరకు ఎలాంటి లీగల్ నోటీసు రాలేదని ఆమె స్పష్టం చేశారు.ఈ వివాదంపై ఖుషి మాట్లాడుతూ.. "సూర్యకుమార్‌తో నాకు గతంలో పరిచయం ఉందని చెప్పాను. నా నోటి నుంచి మాట అలా జారిపోయింది. కానీ, అందులో దురుద్దేశం లేదు. మేము మాట్లాడుకునేవాళ్లం అనేది నిజం. అంతమాత్రాన అది పరువు నష్టం ఎలా అవుతుంది? నేను ఆయన పరువుకు ఎక్కడా భంగం కలిగించలేదు" అని వివరించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని పెద్ద ఆరోపణలుగా మార్చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియానే ఎక్కువగా చేసి చూపిస్తోందని ఖుషి ఆరోపించారు. "న్యూస్ ఛానెళ్లకు టాపిక్స్ లేక చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేస్తున్నాయి" అని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదంలోకి కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు కేవలం ప్రచారం కోసమే దూరారని, అలాంటి వారిని తాను పట్టించుకోనని ఘాటుగా స్పందించారు.
Latest News