|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 02:56 PM
సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి, తన భవిష్యత్ ప్రాజెక్టులపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాని హీరోగా రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని వాయిదా వేసే యోచనలో ఉన్నామని, మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ పీరియాడిక్ సినిమా చేయబోతున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయాలని భావించామని, అయితే అదే సమయంలో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కూడా రానుండటంతో వాయిదా వేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. “సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లపై భారం పడింది. మళ్లీ అలా జరగకూడదు. మేమంతా స్నేహితులం కాబట్టి మాట్లాడుకుని సరైన సమయం నిర్ణయిస్తాం” అని ఆయన చెప్పారు. వేసవిలో పెద్ద సినిమాల సందడి తక్కువగా ఉండటంతో అప్పుడు విడుదల చేసే అవకాశం ఉందన్నారు.
Latest News