|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:45 AM
కృతిశెట్టికి అలా తెలుగు డెబ్యూ మూవీ 'ఉప్పెన', మలయాళ డెబ్యూ మూవీ 'ఎ.ఆర్.ఎం.' కలిసొచ్చాయి. కానీ కోలీవుడ్ డెబ్యూ దగ్గరకు వచ్చేసరికీ అమ్మడికి చుక్కెదురైంది.కన్నడ భామ కృతీ శెట్టి 2021లో 'ఉప్పెన'తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా వంద కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు' కూడా హిట్టే. అలానే 2024లో ఈ అమ్మడు మల్లూవుడ్ లోకి 'ఎ.ఆర్.ఎం.' మూవీతో అడుగుపెట్టింది. ఆ సినిమా కూడా 106 కోట్ల గ్రాస్ ను వసులూ చేసి, మంచి విజయాన్ని అందుకుంది. కానీ చిత్రంగా ఆ తర్వాత కృతీశెట్టికి మలయాళ సినిమా ఆఫర్స్ ఏవీ రాలేదు.ఇదిలా ఉంటే... తెలుగులో హ్యాట్రిక్ సాధించిన కృతిశెట్టిని వరుస పరాజయాలు పలకరించాయి. ఇక ఇక్కడ లాభం లేదని ఈ చిన్నది కోలీవుడ్ పై కన్నేసింది. అక్కడ కార్తీ సరసన 'వా వాతియార్' మూవీకి సైన్ చేసింది. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ యేడాది పొంగల్ కానుకగా జనవరి 14న జనం ముందుకు వచ్చింది. కానీ భారీ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దాంతో తొలిసారి ఆమెకు డెబ్యూ మూవీ కలిసిరాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Latest News