'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్
Wed, Jan 21, 2026, 01:28 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 03:36 PM
టాలీవుడ్‌లో వరుసగా తొమ్మిది బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన 10వ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజా ప్రచారం ప్రకారం, ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్‌తో పాటు దగ్గుబాటి రానా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది మల్టీస్టారర్‌గా తెరకెక్కనుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించనున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ‘F2’, ‘F3’ విజయాల తర్వాత ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News