|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 04:24 PM
అక్కినేని నాగార్జున తన 100వ చిత్రానికి చేరువయ్యారు. 'కింగ్ 100' అనే వర్కింగ్ టైటిల్‌తో కార్తీక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో నాగార్జున మూడు గెటప్స్‌లో, ముగ్గురు కథానాయికలతో కనిపించనున్నారని తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు, 'నాట్యం' ఫేమ్ సుస్మితా భట్ లు హీరోయిన్లుగా ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా సీజన్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. నాగార్జున తన 100వ సినిమా ఈ ఏడాదే ఉంటుందని, ఇది తనకు బిగ్ మైల్ స్టోన్ మూవీ అని తెలిపారు.
Latest News