|
|
by Suryaa Desk | Wed, Jan 21, 2026, 03:09 PM
‘ఉప్పెన’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ తెచ్చుకున్న కృతి... ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా ఆశించిన స్థాయి విజయాలు మాత్రం దక్కలేదు. మంచి నటిగా గుర్తింపు ఉన్నప్పటికీ, కమర్షియల్‌గా పెద్ద హిట్ లేకపోవడంతో ఆమె కెరీర్ కొంత స్లో అయిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆమెకు మరోసారి భారీ అవకాశం దక్కినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఇటీవలే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి... తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు బాబీతో చిరు మరోసారి కలిసి పనిచేయనున్నారు. ఈ సినిమా ఈ నెలలో లాంచ్ అయ్యే అవకాశముండగా, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.
Latest News