|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:45 AM
యంగ్ హీరో రోషన్ మేకా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'చాంపియన్' ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజాం పాలన కాలం నాటి రజాకార్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. అనశ్వర రాజన్ కథానాయికగా నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 2025 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు ₹17 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, రోషన్ మేకా నటనకు, మేకింగ్ వాల్యూస్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇందులో అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించగా, మెలోడీ బ్రహ్మ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఒక విభిన్నమైన పీరియాడిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో హాయిగా వీక్షించవచ్చు. వీకెండ్ లో ఒక మంచి ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా చూడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
Latest News