|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 03:34 PM
'రిప్పన్ స్వామి'. మనం ఏదైతే ఇస్తామో .. అదే మనకి తిరిగొస్తుందని చాటిచెప్పిన కన్నడ కథ ఇది. అది కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి ఆనుకుని ఒక ఎస్టేట్ ఉంటుంది. ఆ ఎస్టేట్ వ్యవహారాలను 'రిప్పన్ స్వామి' (విజయ్ రాఘవేంద్ర) చూసుకుంటూ ఉంటాడు. తన అన్నా వదినలు .. భార్య మంగళ (అశ్వని చంద్రశేఖర్)తో కలిసి అతను ఆ ఎస్టేట్ లో నివసిస్తూ ఉంటాడు. ఆ ఎస్టేట్ లోనే సుందర్ .. థామస్ .. మండా .. మురళి .. జన్నా పనిచేస్తూ ఉంటారు. ఇక రిప్పన్ స్వామికి కుడి భుజంగా సంతోష్ ఉంటాడు. అతని తల్లి శారద (యమున శ్రీనిధి) గతంలో అదే ఎస్టేట్ లో పని చేసి ఉంటుంది.రిప్పన్ స్వామికి ఆవేశం ఎక్కువ. కొట్టిన తరువాత మాట్లాడటమే అతనికి అలవాటు. అతనితో మాట్లాడానికి కూడా అంతా భయపడుతూ ఉంటారు. తన అనుమతి లేకుండా ఎస్టేట్ లోకి ఎవరినీ అడుగుపెట్టనీయడు. డాక్టర్ చదివిన భార్యను సైతం అతను ఇంటికే పరిమితం చేస్తాడు. గతంలో కుప్పుస్వామి .. రిప్పన్ స్వామి ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం వాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది. ఒకరిని దెబ్బతీయడానికి ఒకరు ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఊరుకి పోలీస్ ఆఫీసర్ గా అంజుమాల వస్తుంది. వచ్చిన రోజునే ఆమెకి ..రిప్పన్ స్వామికి మధ్య గొడవ జరుగుతుంది. రిప్పన్ స్వామికి కుడిభుజంగా ఉండే సంతోష్ కనిపించకుండా పోతాడు. రిప్పన్ స్వామి ఎస్టేట్ లో పనివాళ్లుగా ఉన్న సుందర్ టీమ్ ఆయనకి దూరమవుతుంది. అదే సమయంలో ఆనంద్ ను రిప్పన్ స్వామి తన ఎస్టేట్ కి పిలిపిస్తాడు. ఆనంద్ ఎవరు? సంతోష్ ఏమైపోయాడు? రిప్పన్ స్వామికి పనివాళ్లు ఎందుకు దూరమయ్యారు? తన ఆవేశానికి రిప్పన్ స్వామి చెల్లించుకునే మూల్యం ఏమిటి? అనేది కథ.
Latest News