|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:33 PM
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల వివాదంలో చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపునకు 90 రోజుల ముందు ప్రభుత్వ అనుమతిని బహిర్గతం చేయాలన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం కొట్టివేసింది.ఈ అంశంపై సింగిల్ జడ్జి వద్ద విచారణ కొనసాగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. అన్ని అంశాలను సింగిల్ బెంచ్ ముందే తేల్చుకోవాలని నిర్మాతలకు సూచించింది.
Latest News