|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 05:54 PM
మహిళలకు ఉన్న అతిపెద్ద ఆయుధం 'గొంతుక' అని బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అన్నారు. ఏదైనా నచ్చనప్పుడు నిర్మొహమాటంగా మన అభిప్రాయాలను వెల్లడించడమే మన శక్తి అని చెప్పారు. ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ ఎదుటివారి కోసం మన ఇష్టాలను చంపుకోవడం సరైన పద్ధతి కాదని సూచించారు. కేవలం విజయాలను సాధించడం మాత్రమే కాదు... మన విలువలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని తిరస్కరించడం కూడా గొప్ప విషయమేనని చెప్పారు. మనకు నచ్చని విషయాలకు 'నో' చెప్పడం వల్ల మన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఐశ్వర్య అన్నారు. అది మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుందని... ఇదే విషయాన్ని సైకాలజిస్టులు కూడా చెబుతున్నారని తెలిపారు. ఇష్టం లేకపోయినా ప్రతిదానికి 'అవును' అంటూ తలలూపడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు.మనకంటూ కొన్ని హద్దులను గీసుకున్నప్పుడే ఎదుటి వారి నుంచి మనకు గౌరవం పెరుగుతుందని చెప్పారు.
Latest News