|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:36 AM
ది రాజాసాబ్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మాళవిక మోహనన్. మలయాళ భామ అయినా కూడా మాళవిక.. తమిళ్ లో మాస్టర్ సినిమాతో మొదటి హిట్ ను అందుకుంది. ఆ తరువాత వరుసగా తమిళ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చింది. గతేడాది మోహన్ లాల్ తో కలిసి హృదయపూర్వం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక అలాంటి హిట్ అమ్మడు తెలుగులో కూడా వస్తుంది అనుకుంది కానీ, రాజాసాబ్ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.ఇక సినిమాల విషయం పక్కన పెడితే మాళవిక సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం అమ్మడు సోషల్ మీడియాలో వేరే విధంగా ట్రెండ్ అయ్యింది. సాధారణంగా హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ అందరూ ఒక యూనిటీ మెయింటైన్ చేస్తారు. ఒక హీరో .. ఇంకో హీరోను కించపరిచేలా మాట్లాడాడు. హీరోయిన్స్ అయితే తమలో తమకు గొడవలు ఉన్నా కూడా ఇంటర్వ్యూలలో అలాంటివి బయటపెట్టరు. కానీ, మాళవిక మాత్రం.. మిగతా హీరోయిన్లను వెక్కిరిస్తూ మాట్లాడింది. అది కూడా బాలీవుడ్ నటుల ముందు తెలుగు, తమిళ్ హీరోయిన్స్ ను ఎగతాళి చేసింది.అసలేం జరిగగింది అంటే.. మాళవిక నటించిన బాలీవుడ్ మూవీ యుధ్ర ప్రమోషన్స్ లో ఆమె తెలుగు, తమిళ్ హీరోయిన్స్ అందరూ సరిగ్గా నటించరు అని, 1234.. లేక ABCD లు చెప్తూ సీన్ ఫినిష్ చేస్తారని, అలానే వారి కెరీర్ మొత్తం బతికేస్తున్నారని చెప్పుకొచ్చింది. ' చాలాకాలం నుంచి తెలుగు, తమిళ్ లో వర్క్ చేసే హీరోయిన్స్ కి నటించడం రాదు. ముఖ్యంగా విషాద సన్నివేశాలలో వారు లోపల (1,2,3,4) అని లెక్కించుకుంటూ కేవలం విచారకరమైన హావభావాలను ప్రదర్శిస్తారు, అలాగే హీరోపై కోప్పడే సన్నివేశాలలో లోపల (A,B,C,D) అని లెక్కించుకుంటూ నటిస్తారు. వారు కేవలం తమ పెదవులను కదిలిస్తారు. దానికి తగ్గట్లు డబ్బింగ్‌లో దాన్ని సరిచేసుకుంటారు. కేవలం ఒక్క సినిమాకే కాదు, వారి కెరీర్ మొత్తం ఈ విధంగానే నెట్టుకొస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చింది. తానెప్పుడూ అలా చేయలేదని కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Latest News