|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 12:10 PM
మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త ప్రతిభ వెండితెరకు పరిచయమైంది. మెగాస్టార్ చిరంజీవి సోదరి డాక్టర్ మాధవి రావు కుమార్తె నైరా, గాయనిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో 'ఫ్లైయింగ్ హై' అనే పాటను నైరా ఆలపించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో పాటు, పూర్తి వీడియో సాంగ్‌ను కూడా విడుదల చేసింది.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలిని అభినందిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. " 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలోని 'ఫ్లైయింగ్ హై' పాటను నా చిన్న మేనకోడలు నైరా పాడటం చూసి నా మనసు వర్ణించలేని ఆనందంతో నిండిపోయింది. ఇది నీకు ఆరంభం మాత్రమే. నీ ప్రయాణం ఎప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా, అంతులేని అవకాశాలతో నిండి ఉండాలి. ఎప్పుడూ ఇలాగే ప్రకాశిస్తూ, ఎత్తుకు ఎదగాలి" అని చిరంజీవి ఆశీర్వదించారు.
Latest News