|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:28 AM
రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో వైవిధ్యమైన కథతో.. 'ఆత్రేయపురం బ్రదర్స్'. రాజేష్ జగన్నాధం దర్శకుడు. VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజ కార్యక్రమాలతో ఈ చిత్రం మొదలైంది. వశిష్ట, అనుదీప్, ఆదిత్య హాసన్, ప్రవీణ్ కాండ్రేగుల అతిధులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వశిష్ట క్లాప్ కొట్టగా.. విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రవీణ్ కాండ్రేగుల, ఆదిత్య హాసన్ స్క్రిప్ట్ అందించారు. అనుదీప్ మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన కాన్సెప్ట్ పోస్టర్ అలరిస్తోంది. ఏ స్వీట్ రైవల్రీ అనే ట్యాగ్ లైన్ తో ఇద్దరు వ్యక్తులు బల పరీక్ష చేసుకుంటున్నట్లుగా ఈ పోస్టర్ లో ఉంది. ఈ సినిమాకు రమీజ్ నవనీత్ ఛాయాగ్రాహకుడిగా, సంతు ఓంకార్ సంగీత దర్శకుడిగా అనిల్ పసల ఎడిటర్ గా పనిచేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నామని మేకర్స్ చెప్పారు.
Latest News