|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 08:26 AM
బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్ హీరోగా విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ఓ రోమియో’. ఈ థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాలో త్రిప్తీ దిమ్రీ కథానాయిక. విక్రాంత్ మాసే, నానా పటేకర్, అవినాశ్ తివారీ, తమన్నా కీలక పాత్రలు పోషించారు. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో మేకర్స్ బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. అదిరిపోయే పోరాట ఘట్టాలు, ఆసక్తికరమైన సంభాషణలు, అలరించే సంగీతం, అద్భుతమైన విజువల్స్‌తో నిండిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇందులో షాహిద్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. గతంలో విశాల్ భరద్వాజ్, షాహిద్ కపూర్ కలయికలో తెరకెక్కిన ‘కమీనే’, ‘హైదర్’ చిత్రాలు విమర్శకులు ప్రశంసలు పొందాయి.
Latest News