|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 03:01 PM
సినీ హీరో అల్లరి నరేశ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నరేశ్ తాత, ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు ప్రస్తుతం 90 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అల్లరి నరేశ్ కుటుంబం తెలిపింది. ఈ క్రమంలోనే మంగళవారం స్వగృహంలో ఆయన తుదిశ్వాస వదిలారని పేర్కొంది.పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడిలో ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తమ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అల్లరి నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వెంకట్రావు మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పించారు.
Latest News