|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:38 PM
మహిళా క్రికెటర్ స్మృతి మంధాన స్నేహితుడు, నిర్మాత విజ్ఞాన్ మానె కు పలాశ్ ముచ్చల్ పరువు నష్టం నోటీసులు పంపారు. తప్పుడు ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ రూ.10 కోట్లకు తన లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మానెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పలాశ్ ముచ్చల్ పై విజ్ఞాన్ మానె శనివారం సంచలన ఆరోపణలు చేశారు. తాను స్మృతి కుటుంబానికి సన్నిహితుడినని చెప్పుకున్న మానె.. స్మృతి మంధానతో పలాశ్ వివాహం ఆగిపోవడానికి కారణం ఆయన చేసిన మోసమేనని, పెళ్లి రోజే పలాశ్ మరో యువతితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని మీడియాకు వెల్లడించారు. దీంతో స్మృతి వివాహాన్ని రద్దు చేసుకుందని, కోపం పట్టలేక మహిళా క్రికెటర్లు పలాశ్ పై చేయిచేసుకున్నారని మానె తెలిపారు.అంతేకాదు, ఓ సినిమా చేయడానికి పలాశ్ తన వద్ద రూ.40 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడని, ఆ సొమ్ము తిరిగివ్వడంలేదని చెప్పారు. ఈ ఆరోపణలను పలాశ్ ముచ్చల్ వెంటనే ఖండించారు. మానె ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగించేలా తీవ్ర ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. దీనిని అంత తేలికగా వదలనని చెప్పారు. అన్నట్లుగానే మరుసటిరోజే తన లాయర్ ద్వారా మానెకు పరువునష్టం నోటీసులు పంపించారు.
Latest News