|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 02:41 PM
టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల విడుదల ఆలస్యం అవుతున్న నేపథ్యంలో, ప్రభాస్ మాత్రం ఏడాదికి రెండు, మూడు సినిమాలు విడుదల చేస్తూ దూసుకుపోతున్నాడు. 2027లో ప్రభాస్ 'స్పిరిట్', 'ఫౌజీ', 'కల్కి 2' అనే మూడు సినిమాలు విడుదల కానున్నాయి. స్పిరిట్ (Spirit): సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ పవర్‌ఫుల్ పోలీస్ డ్రామా మార్చి 5న విడుదల కానుంది.ఫౌజీ (Fauji): హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ వార్ డ్రామాను ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.కల్కి 2 : గ్లోబల్ హిట్ ‘కల్కి 2898 ఏడీ’ కి సీక్వెల్‌గా వస్తున్న ఈ విజువల్ వండర్ ఏడాది చివరలో బాక్సాఫీస్‌ను పలకరించనుంది.ఈ మూడు చిత్రాల తర్వాత కూడా ప్రభాస్ లైనప్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ప్రశాంత్ వర్మతో ఒక భారీ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్, అలాగే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సలార్ 2’ కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. స్టార్ హీరోలందరిలోనూ ప్రభాస్ ఇప్పుడు అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేస్తున్న హీరోగా నిలుస్తున్నారు.
Latest News