|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 04:08 PM
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన రెండో చిత్రం 'ది ప్యారడైస్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న తొలి పాట విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ పాటలో నాని మేనరిజం, మెంటల్ మాస్ స్వాగ్ కనిపించేలా ట్యూన్ కంపోజ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ మార్చి 26న తెలుగుతో పాటు ఎనిమిది భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా విడుదల కానుంది.ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన అంశం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్‌గా నటిస్తుండటం. చాలా కాలం తర్వాత ఆయన ఒక పూర్తి స్థాయి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పోషిస్తున్న పాత్ర అత్యంత క్రూరంగా, ప్రమాదకరంగా ఉంటుందని సమాచారం. మోహన్ బాబు మార్క్ డైలాగ్ డెలివరీ, గంభీరమైన నటన నాని పాత్రను మరింత ఎలివేట్ చేయడానికి తోడ్పడనున్నాయి. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.
Latest News