|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 04:54 PM
ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు మారుతి రూపొందించిన హారర్ కామెడీ చిత్రం 'ది రాజాసాబ్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 9న థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ హారర్ కామెడీ చిత్రం, విడుదలైన నెల రోజుల లోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుండటం గమనార్హం. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అత్యంత భారీ ధరకు సొంతం చేసుకుంది.ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 'ది రాజాసాబ్' తమ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుందని సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను వీక్షించవచ్చు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ, ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూడాలనుకునే అభిమానుల కోసం ఈ చిత్రం ఓటీటీలో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.
Latest News