|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:42 PM
బిగ్‌బాస్‌తో పరిచయమైన నటి కీర్తి భట్, నటుడు విజయ్ కార్తీక్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకుని, స్నేహితులుగా కొనసాగుతామని ప్రకటించింది. దీనిపై విజయ్ కార్తీక్ స్పందిస్తూ, హాయ్ అండీ..ఈ వీడియో చేయాలని అస్సలు అనుకోలేదు. కానీ నిన్న ఈవినింగ్ కీర్తి గారు పోస్ట్ పెట్టిన తరువాత చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. ఫోన్ కూడా చేస్తున్నారు. దయచేసి మీరు కీర్తి గారిని వదిలేయకుండీ.. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోండి అని చాలామంది కంటిన్యూగా మెసేజ్‌లు పెడుతున్నారు. ఇద్దరి అంగీకారంతోనే విడిపోతున్నాం.. ఫ్రెండ్స్ ఉంటాం అని కీర్తి మెసేజ్ చేయడంతో..అంతా నాకు కాల్స్ చేస్తున్నారు. విడిపోవడం అనేది నా నిర్ణయం కాదు. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.నాతో పాటు నా ఫ్యామిలీ కూడా అదే కోరుకున్నారు. అలాంటప్పుడు నేనెందుకు ఆమెతో విడిపోవాలని కోరుకుంటాను.అది నా నిర్ణయం కాదు.. ఆమె సొంతంగా తీసుకున్న నిర్ణయం. నేను ఫైనాన్షియల్‌గా స్టేబుల్ కాలేదనే స్ట్రాంగ్ రీజన్ ఆమెకి అనిపించింది. అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. తను డిసెంబర్‌లోనే నాకు ఈ మాట చెప్పి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అది ఆమె జీవితం కాబట్టి.. ఆమె నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు. ఆమెకి ఆ హక్కు ఉంది. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నేను చాలా వరకూ ఆమెను కన్విన్స్ చేశాను. కేవలం డబ్బులు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆమె చాలా క్లియర్‌గా చెప్పింది. నేను కాంప్రమైజ్ అయ్యి బతకడం ఇష్టం లేదని చెప్పింది. తనకి ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని నాకు క్లియర్‌గా చెప్పింది. అందుకే నన్ను వదిలేసింది. అతనితోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానని ఆమె నాకు ఆల్రెడీ డిసెంబర్‌లోనే చెప్పారు. ఆమె నాకు ఆ మాట చెప్పినప్పుడు చాలా కన్విన్స్ చేయడానికి చూశాను. వదిలేయొద్దు మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. కానీ ఆమె నిర్ణయం తీసుకునే నాకు చెప్పింది. కాబట్టి నేనేం చేయలేకపోయాను. ఆమె చాలా స్ట్రాంగ్ నిర్ఱయం తీసుకుని వచ్చి నాతో డిస్కస్ చేశారు.
ఆమె విడిపోవాలని అంత బలంగా చెప్పినప్పుడు బలవంతంగా ఆమెతో ఉండాలని అనుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఫోర్స్‌ఫుల్‌గా ప్రేమను పొందలేం. నాతో పాటు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కన్వెన్స్ చేయడానికి చూశాం. ఆమె వినే పరిస్థితిలో లేదు.. మా ప్రయత్నాలు ఫలించలేదు. జరిగింది జరిగిపోయింది.. కాబట్టి.. ఆమె, వాళ్లిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది ఆమె ఫొటోలు డిలీట్ చేసింది కదా.. మీరెందుకు డిలీట్ చేయడం లేదు అని అడుగుతున్నారు
Latest News