|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:27 PM
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ ఓటీటీ విడుదలకు మూహూర్తం ఖరారైంది. ఈ మూవీ ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. జనవరి 14న సంక్రాంతి బరిలోకి చివరిగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న యువకుడిగా శర్వానంద్ నటన ఆకట్టుకోగా, హీరోయిన్లుగా సాక్షి వైద్య, సంయుక్త తమ పాత్రల్లో మెప్పించారు. నరేశ్, సత్య, సునీల్, వెన్నెల కిశోర్ తమదైన శైలిలో కామెడీతో అలరించారు. దర్శకుడు రామ్ అబ్బరాజు వినోదాత్మక కథలను తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను మరోసారి నిరూపించారు.
Latest News