![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 03:56 PM
పటాన్చెరు : పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండలగూడ ప్రజల కోసం బండలగూడలో మూడు ఎకరాల విస్తీర్ణంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల కమ్యూనిటీల కోసం ఒక కోటి 71 లక్షల రూపాయల అంచనా వ్యయంతో స్మశాన వాటికలు నిర్మించడం జరిగిందని.. అతి త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్మశాన వాటిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండలగూడ ప్రజలకు స్మశాన వాటిక కోసం తరచూ ఇబ్బందులు ఏర్పడుతుండడంతో.. శాశ్వత ప్రాతిపదికన మూడు ఎకరాలను కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అందించిన నిధులతో పాటు 20 లక్షల రూపాయల సొంత నిధులు స్మశాన వాటిక అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి మతానికి ఎకరా చొప్పున స్థలం కేటాయించి.. అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు.బండల గూడ పరిధిలో అత్యధికంగా వివిధ రాష్ట్రాలకు చెందిన. పేద, మధ్యతరగతి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని.. వారి కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంత్యక్రియలు నిర్వహించుకునేలా వీటిని నిర్మించినట్లు తెలిపారు. అతి త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, ఈఈ సురేష్ కుమార్, డిఈ నరేందర్, ఏ ఈ శివ కుమార్, కాంట్రాక్టర్ వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.