|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 10:37 AM
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ తన 55వ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీలను ప్రకటించారు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్, శ్రీలీల మొదటిసారి కలిసి నటిస్తున్నారు. 'అమరన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గుతున్న తరుణంలో శ్రీలీలకు ధనుష్‌తో నటించే అవకాశం రావడం ఆమె కెరీర్‌కు ఊపునిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న శ్రీలీల ఇటీవల పరాశక్తి మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ఈ మూవీ 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. ఇందులో తెలుగు వాళ్లను అవమానించేలా డైలాగ్ ఉండటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.2025లో శ్రీలీల హీరోయిన్ గా నటించిన రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఏ మూవీ కూడా శ్రీలీలకు హిట్ ఇవ్వలేకపోయింది. వరుసగా సినిమాలు చేస్తున్నా ఈ బ్యూటీకి హిట్ మాత్రం దక్కడం లేదు. ఇప్పుడు హిందీలో ఓ మూవీ, తెలుగులో పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఆశలు పెట్టుకుంది శ్రీలీల. ఇప్పుడు ధనుష్ తో మూవీ ఛాన్స్ తో ఆమె కెరీర్ దశ తిరుగుతుందేమో చూడాలి.
Latest News