|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 01:03 PM
నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నారైలకు శుభవార్త చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే పరిమితి పెంపునకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ ఆర్థిక మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి, మరింత ప్రపంచ మూలధనాన్ని ఆకర్షించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి కీలక చర్యలను ప్రకటించారు.గతంలో భారత కంపెనీల ఈక్విటీల్లో ఎన్నారైల పెట్టుబడి పరిమితి 10 శాతం ఉండగా, ఇప్పుడు దానిని 24 శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) ద్వారా లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే పరిమితిని 5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. దీని వల్ల భారత మార్కెట్‌లోకి పెద్ద మొత్తంలో నిధులు వస్తాయి.