|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:00 PM
వికారాబాద్ జిల్లాలో ఒక యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడి కోసం ఏకంగా కన్నవారినే కడతేర్చింది. వివరాల్లోకి వెళ్ళితే... వికారాబాద్ జిల్లా యాచారంలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. నక్కల సురేఖ అనే యువతి నర్సింగ్ పూర్తి చేసి ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్న ఒకే ఒక్క కారణంతో వారిపై కక్ష పెంచుకుంది. తాను పని చేస్తున్న ఆసుపత్రి నుంచి అత్యవసర సమయంలో వాడే మత్తు ఇంజెక్షన్లను గుట్టుగా తెచ్చి, నడుము నొప్పి తగ్గుతుందంటూ మాయమాటలు చెప్పి కన్నతల్లిదండ్రులకు అధిక మోతాదులో ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ల ధాటికి వారు కుప్పకూలిపోగా, ఏమీ తెలియనట్లు తన అన్నకు ఫోన్ చేసి వారు స్పృహ తప్పారని నాటకమాడింది. కానీ సంఘటనా స్థలంలో దొరికిన ఖాళీ సిరంజిలు ఆమె చేసిన ఘోరాన్ని పోలీసులకు పట్టించాయి.