|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:22 PM
హైదరాబాద్‌లో 2024లో రూ.130 కోట్లకుపైగా మాదకద్రవ్యాలు పట్టుబడగా, 2025లో ఈ విలువ రూ.50 కోట్లకు పరిమితమైంది. దీంతో రాజధానికి మత్తు పదార్థాల రాక తగ్గినట్లు కనిపిస్తోంది. మత్తు ముఠాలు చిన్న మొత్తాల్లో రవాణా చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. తెలంగాణ ఈగల్, ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్, హెచ్‌న్యూ విభాగాల నిఘా పెరగడంతో స్మగ్లర్లు కొత్త దారులు అనుసరిస్తున్నారు. పెద్ద మొత్తాలకు బదులు తక్కువ పరిమాణాల్లో సరకు రవాణా చేస్తున్నారు. దీంతో 2024తో పోలిస్తే 2025లో కేసులు, నిందితుల అరెస్టులు పెరిగాయి. ముఖ్యంగా సింథటిక్ డ్రగ్స్ రవాణా స్వరూపం మారిపోతోంది, 10 గ్రాములకు మించి పట్టుబడటం లేదు. పాదరక్షలు, దిండుల వంటి మార్గాల్లో తరలిస్తున్నారు. గతంలో టన్నులు, క్వింటాళ్ల లెక్కన గంజాయి స్వాధీనాలుండేవి. ఇప్పుడు చిన్న మొత్తాల్లో కమీషన్లకు ఆశపడే ఏజెంట్ల ద్వారా రవాణాకు సిద్ధపడుతున్నారు.