గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:15 PM
ఆధార్ కార్డు సేవలను మరింత సరళతరం చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకునే విషయంపై కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎక్కడి నుంచైనా మొబైల్ నెంబర్ ను అప్ డేట్ చేసుకునే సదుపాయం కల్పించనుంది.దీని కోసం త్వరలో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఆధార్ సేవలను మరింత సౌకర్యవంతంగా వినియోగించుకునేలా చేయడమే దీని ఉద్దేశమని తెలిపింది. ఈ నెల 28 తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.