గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 06:45 PM
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం (జనవరి 27) డ్రగ్స్ దందా చేస్తున్న ఐటీ ఉద్యోగి సాయి కిరణ్ ను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 1.30 లక్షల విలువైన 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వృత్తిరీత్యా ఐటీ ఉద్యోగి అయిన సాయి కిరణ్, ఐటీ ఉద్యోగులనే లక్ష్యంగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టి అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.