గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 07:27 PM
బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తూ, ఒంటినిండా విషం నింపుకుని కాంగ్రెస్ పట్ల విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో రూపొందిన మంచి పథకాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు. రాబోయే ఏప్రిల్ నెలలో మళ్లీ కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని, ఆ తర్వాత మరో మూడు దఫాలుగా ఇళ్లు మంజూరీ చేస్తామని ప్రకటించారు.ప్రజలు గతంలో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోందని స్పష్టం చేశారు.