|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:08 PM
అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సమ్మక్క సారక్క జాతర మహోత్సవం సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జోగిని శ్యామల నేతృత్వంలో బోనం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ప్రతిసారి బోనం ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అమీన్పూర్ డివిజన్ ఆధ్వర్యంలో జాతర కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.